తెలుగులో మూడు నాలుగు చిత్రాల్లో నటించి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది తాప్సి. ఇప్పుడు తనని అందరూ బాలీవుడ్ నటి అనే పిలుస్తున్నారు. తన సినిమాల ఎంపికతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె తాజాగా ఓ దర్శకుడి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థప్పడ్’. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఆదివారంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సందర్భంగా అనుభవ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తాప్సి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఎట్టకేలకు ‘థప్పడ్’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. 31 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేశాం. ఈ 31 రోజులు తుఫాను కంటే వేగంగా గడిచిపోయాయి. అనుభవ్ సిన్హాలాంటి దర్శకుడితో కలిసి రెండోసారి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెబుతుంటాను. కానీ ఒక్కోసారి అనుభవ్‌తో కలిసి పనిచేయడం ఓ శాపం లాంటిది. ఎందుకంటే.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఆయనతో కలిసి పనిచేయడంలో ఎంతో సంతోషం ఉంటుంది. కానీ తక్కువగా అనిపించేది మాత్రం ఆయనతో కలిసి పనిచేసే సమయం మాత్రమే. ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్‌లోకి అడుగుపెట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అనుభవ్.. నేను నటిగా కాకపోయినా న్యూట్రిషనిస్ట్‌గా మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాను’ అన్నారు. అయితే తాప్సి.. అనుభవ్‌పై గౌరవంతో ఈ రకంగా పోస్ట్ చేసినప్పటికీ అది కాస్తా పలువురు నెటిజన్లకు రాంగ్ వేలో కన్వే అయింది. ఆ దర్శకుడితో కలిసి పనిచేయడం ఓ శాపం అనగానే తాప్సికి లైంగిక వేధింపులు ఏమన్నా ఎదురై ఉంటాయేమోనని పలువురు కన్‌ఫ్యూ్జ్ అయ్యారు. ఏదైతేనేం.. తాప్సి నుంచి మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. దీంతో పాటు ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు తాప్సి ‘తడ్కా’ అనే సినిమాతోనూ బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa