ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా త‌దుప‌రి సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే....

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 06:40 PM

టాలీవుడ్ లో 'అర్జునరెడ్డి' సినిమా తో ఓవర్ నైట్ లోనే  స్టార్ హీరోల సరసన చేరిపోయిన విజయ్ దేవరకొండ తో త‌న త‌దుప‌రి చిత్రం ఉంటుంద‌ని అన్నాడు ద‌ర్శ‌కుడు  సందీప్ వంగా .  . 'అర్జున్ రెడ్డి   సినిమానే హిందీలో 'కబీర్ సింగ్' గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ సాధించడం తో సందీప్ వంగా అక్క‌డ అవ‌కాశాలు అందుకుంటున్నారు. అంత చక చక అయిపోయాయి. ఆ తర్వాత వెంటనే మరో బాలీవుడ్ సినిమా అవకాశం వచ్చింది సందీప్ కి.  అయితే  విజయ్ దేవరకొండతో మరో సినిమా ఎప్పుడు చేస్తారు.. ?   అంటూ ఇటీవ‌ల జ‌రిగిన  ఒక ఇంటర్వ్యూలో యాంక‌ర్‌ అడిగితే క్షణం తడుముకోకుండా ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమా తర్వాత విజయ్ తోనే చేస్తానని వెల్లడించాడు. దీంతో  విజయ్ సినిమా దాదాపుగా ప్యాన్ ఇండియా ఫిలిం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa