‘రాజాగారు గది’ ప్రాంచైజీలో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో ఛోటా కె. నాయుడు కెమెరా సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఛోటా కె. నాయుడు పాత్రికేయుల సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ.. తనకు చాలా కాలంగా ఓంకర్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని.. ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడుకుంటామని.. ఈ క్రమంలోనే ‘రాజుగారి గది 3’ సినిమాకి పని చేయడానికి వెంటనే అంగీకరించానని చోటా చెప్పారు. ఇక ఈ సినిమా హీరో అశ్విన్ గురించి మాట్లాడుతూ, హీరోగా అశ్విన్ తన నటనతో తనను ఆశ్చర్యపరిచాడని.. ఖచ్చితంగా తను తన కెరీర్లో చాలా దూరం వెళ్తాడని ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ చిత్రంలో తక్కువ హర్రర్ ఎక్కువ కామెడీ ఉంటుందని చోటా చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa