డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తున్న రెండవ చిత్రం రొమాంటిక్. ఆకాష్ కి జంటగా కేతిక శర్మ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కొద్దిరోజుల క్రితం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం రొమాంటిక్ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తున్నారట. రొమాంటిక్ మూవీలో ఓ పవర్ఫుల్ లేడీ పాత్ర ఉండగా దానికి రమ్యకృష్ణ తీసుకోవడం జరిగిందని తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ లో మొదలైన ఈ మూవీ షెడ్యూల్ నందు నేటినుండి ఆమె పాల్గొననున్నారు. రజిని నటించిన ‘నరసింహ’ మరియు ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రాలలో రమ్యకృష్ణ ఫెరోషియస్ రోల్స్ చేయడం జరిగింది. ఈ మూవీలో కూడా ఇలాగే కీలకంగా ఉంటుందని వినికిడి. ఇక అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్,ఛార్మి నిర్మిస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునైన వంటి వారు కీలక పాత్రలలో కనిపిస్తుండగా, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa