సైరా వంటి భారీ సక్సెస్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డికి దర్శక మహనీయుడు కేవీ రెడ్డి పురస్కారం అందింది. మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో యువకళావాహిని ఆధ్వర్యంలో చలనచిత్ర పురస్కార ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాఘవేంద్ర రావు చేతుల మీదుగా సురేందర్ రెడ్డికి కేవీ రెడ్డి పురస్కారాన్ని అందించారు. సైరా నరసింహా రెడ్డి సినిమా ద్వారా సైరా సురేందర్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని పలువురు ముఖ్యులు ఆయనను ప్రశంసించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa