ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార‌తీయుడు 2లో 2000 మంది జూ. ఆర్టిస్టుల‌తో భారీ యాక్ష‌న్‌సీన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 06:18 PM

ప్రముఖ దర్శకుడు శంకర్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ అప్ప‌ట్లో దాదాపు అన్ని భాష‌ల‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్‌. ఈ సినిమా వ‌చ్చి అప్పుడే  22 ఏళ్ల తర్వాత కూడా  వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ క్ర‌మంలోనే శంక‌ర్ రాసుకున్న  ‘భారతీయుడు-2’ సినిమా కు క‌థానాయ‌కుడుగా క‌మ‌ల్ న‌టిస్తుండ‌గా ఆత‌ని స‌ర‌స‌న‌ కాజల్‌ కథానాయికగా ఛాన్సు ద‌క్కించుకుంది.  ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండ‌గా . ఓ యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు   ఈ చిత్రబృందం  భోపాల్‌ వెళ్లనున్నారట. ఇందుకు  రూ.40 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌కూడా నిర్మించార‌క్క‌డ.  పీటర్‌హెయిన్స్‌ పర్యవేక్షణలో 25 రోజుల పాటు చిత్రీకరించే ఈ యాక్షన్‌ సన్నివేశం కోసం సుమారు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పనిచేయనున్నారని తెలుస్తోంది..   లైకా ప్రొడక్షన్స్   నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియాభవానీ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa