నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రం నిన్నటితో షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలాగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి సంబంధించి చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటల 50 నిముషాలకు సినిమా టైటిల్ ను మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మరి అదే టైటిల్ ను ప్రకటిస్తారా లేక కొత్త టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారా అనేది చూడాలి. `జైసింహా` వంటి విజయవంతమైన చిత్రం తర్వాత కె.ఎస్.రవికుమార్ – బాలయ్య హిట్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనపడనున్నారు. ఇక ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa