పవన్, శైలజ జంటగా వి.ఆర్ ఇంటర్నేషనల్ పతాకం పై పి .వీరా రెడ్డి నిర్మాతగా జి.మురళి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం `మేరా దోస్త్`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 6న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ఆదివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత పి.వీరా రెడ్డి మాట్లాడుతూ ``సినిమా అంతా కంప్లీట్ అయ్యింది. ఈ నెల 6న దాదాపు 150 థియేటర్స్ లో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. సినిమా పట్ల మా టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. స్టోరీ, చిన్నాగారి మ్యూజిక్ మా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది`` అన్నారు. డైరెక్టర్ జి. మురళి మాట్లాడుతూ ``నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. ప్రేమ , ఫ్రెండ్ షిప్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఈ నెల6న సినిమా రిలీజ్. మా ప్రయత్నాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ``అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa