‘మధురా పురి సదన… మృదు వదన’ అంటూ ఇప్పటికే సందడి మొదలు పెట్టాడు ‘అజ్ఞాతవాసి’. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ‘అజ్ఞాతవాసి’ ఇప్పుడు టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ టీజర్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ‘మధురా పురి సదన… మృదు వదన’ అనే కీర్తనతో టీజర్ మొదలైంది. ఇందులో పవన్ లుక్, హావభావాలు ఊహాతీతం!
ఈ సినిమా నుండి వస్తున్న వస్తున్న ఒకొక్క మెటిరియాల్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన ఓ స్టిల్ లో పవన్ కీర్తి రోమాన్స్ అదిరింది. ఫారిన్ లొకేషన్ లో తీసిన ఈ ఫోటో భలే రొమాంటిక్ గా వుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa