తన బాయ్ ఫ్రెండ్ మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నాడంటే.. ఏ అమ్మాయికైనా చిర్రెత్తుకురావడం కామన్. ఇక విషయం ముద్దుల దాకా వెళ్లినట్లు తెలిసిందంటే.. గర్ల్ ఫ్రెండ్ ప్రకోపానికి బలైపోవాల్సిందే. దేవరకొండ.. నిజంగా కిరాక్ అబ్బా!, మనోడి క్రేజ్ మామూలుగా లేదు.. అక్కడ కూడా? పాపం.. మన విజయ్ దేవరకొండ కూడా ఇలాగే బలైపోయాడట. అలా అని ఇదేమి నిజంగా ఎఫైర్ కాదండోయ్. ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కే తన గర్ల్ ఫ్రెండ్ గగ్గోలు పెట్టిందని చెబుతున్నాడు.'అర్జున్ రెడ్డి సినిమా చేశాక నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడూ గొడవలే. అందుకే ఆ సినిమా నాకు చాలా కష్టంగా అనిపించింది.' అని విజయ్ దేవరకొండ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమాలో రొమాంటిక్, యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా విజయ్ కనిపించిన సంగతి తెలిసిందే.
బహుశా సినిమాలో హీరోయిన్‌తో ముద్దు సన్నివేశాలపై విజయ్ గర్ల్‌ఫ్రెండ్ గొడవ పడి ఉంటుందేమో!అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్నప్పటికీ.. గర్ల్ ఫ్రెండ్‌తో గొడవలు మాత్రం నైట్ మేర్‌ను తలపించాయనేలా ఉన్నాయి విజయ్ మాటలు.అర్జున్ రెడ్డి సినిమా చేస్తున్నప్పుడు టాలీవుడ్‌లో ఇదివరకు ఎప్పుడూ ఎవ్వరూ చేయని సినిమా నేను చేస్తున్నానని ముందే అనిపించిందన్నారు విజయ్. సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని భావించామని, తమ అంచనాలకు తగ్గట్టే సినిమా భారీ సక్సెస్ అందుకుందని అన్నారు.ప్రస్తుతం తాను 'ఏ మంత్రంవేశావె'తో పాటు 'ట్యాక్సీవాలా', 'మహానటి' చిత్రాల్లో నటిస్తున్నట్లు విజయ్ తెలిపారు.
ట్యాక్సీవాలా సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని చెప్పారు. ఇందులో క్యాబ్ డ్రైవర్‌గా నటిస్తున్నానని, ఈ సినిమా వచ్చాక తనలోని అర్జున్ రెడ్డిని మరిచిపోతారని విజయ్ పేర్కొనడం గమనార్హం.ఇక 'మహానటి' చిత్రంలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చారు విజయ్. అందరూ అనుకుంటున్నట్లు తాను ఎంజీఆర్ పాత్రలో కానీ ఎన్టీఆర్ పాత్రలో కానీ నటించడం లేదన్నారు. తాను, సమంత ఇద్దరం జర్నలిస్టు పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అయితే తన పాత్ర చిన్నదే అయినప్పటికీ.. ఒక గొప్ప నటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఎలాంటి పాత్ర అయిన ఫర్వాలేదన్నారు.అర్జున్ రెడ్డికి సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్రకు విజయ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడే సీక్వెల్ గురించి చర్చించామని అన్నారు. అర్జున్ రెడ్డి పాత్ర గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పట్లో సీక్వెల్ తీసే ఆలోచన కూడా లేదని అన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa