ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డుల మోత మోగించేలా 'అల వైకుంఠపురములో' టీజర్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2019, 04:30 PM

 స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో..' సినిమా టీజర్‌ వచ్చేసింది. బుధవారం సాయంత్రం ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆకట్టుకునే సన్నివేశాలతో ఈ టీజర్‌ను రూపొందించారు. ప్రస్తుతం AVPLTeaserDay అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉంది.


ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు విశేషమైన స్పందన లభించింది. 'సామజవరగమన..' యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa