నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్, జీనియస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించి సెన్సషనల్ కథారచయితగా పేరుతెచ్చుకున్న చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెడుతూ.. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ ని స్థాపించారు.. తొలిప్రయత్నంగా “కింగ్ ఫిషర్” వంటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే యువ టాలెంటెడ్ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక “కింగ్ ఫిషర్” చిత్రం బ్యానర్, టైటిల్ లోగో విడుదల కార్యక్రమం డిసెంబర్ 16న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపి రంగురామకృష్ణంరాజు, ప్రముఖ సీనియర్ దర్శకులు బి.గోపాల్, ప్రముఖ రచయితలు వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, యువదర్శకుడు కె.యస్.రవీంద్ర {బాబీ}, మాధవ్ పట్నాయక్ (కంజూమర్ కోర్ట్ జడ్జి), నిర్మాతలు రాధామోహన్, దాసరి కిరణ్, కత్తి మహేష్, హీరో అవీష్, బాలకృష్ణ అభిమాని జగన్ పాల్గొన్నారు. చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్ లోగోని వి.వి.విజయేంద్రప్రసాద్, పరచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్ ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa