సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'దర్భార్' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందిఈ మూవీ టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక రజనీకాంత్ 168వ చిత్రం కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ చిత్రం నిన్నటి నుండి షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్‌లో జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో రజనీకాంత్ పాల్గొన్నారు. పాటతో సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని సంగీత దర్శకుడు డి ఇమ్మాన్ తెలిపాడు. ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు . శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది చివరలో రిలీజ్ కానుంది. సన్‌పిక్చర్స్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa