‘రంగస్థలం’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆతర్వాత ఈ భామకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పుడు ఆమె ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో అనసూయ నటించనుంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఆమె ఫొటోను ట్వీట్ చేస్తూ… “ఎప్పుడూ నవ్వుతూ ఉండే అనసూయతో పనిచేయడం సంతోషంగా ఉంది. ఆమె ఓ స్పైసీ పాత్రలో కనిపించబోతోంది”అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో అనసూయ చేతినిండా గాజులు, మెడలో ఆభరణాలు ధరించి చీరలో దర్శనమిచ్చింది. చిరునవ్వులు చిందిస్తున్న ఆమె ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa