తెలుగులో సంచలన విజయం సాధించిన `అర్జున్‌రెడ్డి` హిందీ రీమేక్‌గా `కబీర్‌సింగ్` తెరకెక్కింది. షాహిద్ కపూర్, కియారా ఆడ్వాణీ జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. అదే సమయంలో తీవ్ర విమర్శలనూ ఎదుర్కొంది. మహిళలను చాలా చులకనగా చూపించారని చిత్రంపై విమర్శలు వచ్చాయి. `కబీర్‌సింగ్`తో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన కియార ఆ వివాదాలపై స్పందించింది.
`కబీర్‌సింగ్` నా జీవితాన్ని మలుపు తిప్పింది. `లస్ట్‌స్టోరీస్`తో గుర్తింపు లభించింది. `కబీర్‌సింగ్` నాకు ఎందరో అభిమానులను సంపాదించి పెట్టింది. ఇటీవల చండీగఢ్‌లో ఓ కార్యక్రమానికి వెళితే అందరూ నన్ను `ప్రీతి.. ప్రీతి` అని పిలవడం ప్రారంభించారు. అది నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. ఇక, ఆ సినిమాపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడాలంటే.. ప్రతీ ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. దానినే వాళ్లు చెప్పారు. నాలోనూ ఆ సినిమాపై రెండు రకాల అభిప్రాయలున్నాయి. ఒక నటిగా అది నాకు మర్చిపోలేని చిత్రం. కానీ, ఓ సగటు మనిషిగా మాత్రం `కబీర్‌సింగ్`లాంటి చిత్రాలను అంగీకరించన`ని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa