నేచురల్ స్టార్ నాని తన కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయటం లో ఎప్పుడూ ముందుంటాడు. ఏదైనా సబ్జెక్టు నచ్చితే సొంత నిర్మాణానికి కూడా వెనుకాడడు. ఈ జెంటిల్మాన్ అందుకే తనకు బాగా నచ్చిన సబ్జెక్టు కు తానే నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం 'అ! . ఆర్ధిక విజయం సాధించక పోయినా విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ చిత్రం . కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మేకప్ మేన్‌గా పనిచేసిన రంజిత్ జాతీయ అవార్డు దక్కించుకున్నాడు. తెలుగు సినీ చరిత్రలో జాతీయ అవార్డు సాధించిన తొలి మేకప్ మేన్‌గా రంజిత్ నిలిచాడు. తాజాగా అవార్డు అందుకున్న రంజిత్ ఫొటోను నాని ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశాడు. `తెలుగు సినీ చరిత్రలో మేకప్ విభాగంలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తి రంజిత్. అందులోనూ మా ప్రొడక్షన్‌లో తొలి సినిమాతో. రంజిత్‌ను చూస్తే చాలా గర్వంగా ఉంది. `అ` కోసం ఎంతో కష్టపడి పనిచేసిన పర్సనల్ మేకప్ మేన్లందరికీ ధన్యవాదాలు` అంటూ నాని ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa