సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న అందాల భామ అనుష్క శెట్టి. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలతో లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది.'బాహుబలి' తర్వాత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు అనుష్క.. ప్రస్తుతం "నిశ్శబ్ధం"అనే క్రాస్ ఓవర్ సినిమాలో నటిస్తోంది అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క పెయింటర్‌గా కనిపించనుంది. ఆమె నటించిన చిత్రం 'నిశ్శబ్దం' వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇది కూడా థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమానే... ఇప్పుడు తాజాగా అనుష్క మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుందని తాజా సమాచారం. ఈ సినిమా లో అనుష్క మిలటరీ బ్యాక్ డ్రాప్‌లో నటించనున్నారు.. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు గౌతమ్ మీనన్.తెలుగు మరియు తమిళ భాషలలో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అనుష్క భారీ పోరాట సన్నివేశాలలో నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వర్కౌట్స్ మొదలుపెట్టారట. ఈ సినిమా జనవరి లో మొదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa