నటి శ్రియ కొన్ని రోజుల గ్యాప్ అనంతరం తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. ‘సబ్ ఖుషల్ మంగళ’ అనే హిందీ సినిమాలో అక్షయ్ ఖన్నా సరసన ఓ పాటలో నటించడానికి ఇటీవల ఈ ముద్దుగుమ్మ ముంబై వచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రియాను వివాహమాడిన తర్వాత శ్రియ అతనితో కలసి బార్సెలోనాలో ఉంటోంది. ఈ చిత్ర నిర్మాత తనకు స్నేహితుడు కావడం వల్ల ఈ పాటలో నటించానని శ్రియ చెప్పింది. మరి ఇకపై సినిమాల్లో నటిస్తుందో లేదో చెప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa