యంగ్ హీరో నాగ శౌర్య తాజా సినిమా అశ్వథామ. ఈ సినిమా నూతన దర్శకుడు రమణ తేజ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. ఉషా ములుపురి నిర్మాతగా వ్యవహరిస్తుండగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ శౌర్య అన్యాయాలను ప్రశ్నించే సామజిక స్పృహ కలిగిన యువకుడిగా నటిస్తున్నారు. కాగా నేడు ఈ మూవీ టీజర్ టాలీవుడ్ ఏంజెల్ సమంత అక్కినేని విడుదల చేశారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ఈచిత్రంలో మాస్ హీరోలా సరి కొత్తగా కనిపిస్తున్నాడు. విశాఖ వేదికగా జరిగే ఓ పెద్ద మెడికల్ మాఫియాతో ఓ యువకుడు చేసే యుద్ధమే అశ్వథామ చిత్రం అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తన స్వార్ధం కోసం అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకొనే ఓ మాఫియా లీడర్ ని నాగ శౌర్య ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ప్రధాన కథ. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో సీరియస్ గా సాగిన అశ్వథామ టీజర్ ఆసక్తికరంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa