యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’. కాగా ఈ సినిమా జనవరి 31న విడుదల కాబోతుంది. ఈ మూవీ ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాల భాగం నడుస్తోంది. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మర్డర్ చేసేది అనుష్కనేనట. ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుందని.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. ఇక మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఇక ఈ చిత్రంలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa