దర్శకుడి గా వి.వి వినాయక్ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. వి.వి వినాయక్ హీరోగా మారి చేస్తున్నసినిమా 'శీనయ్య'. ఈ సినిమాకి నరసింహారావు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఐతే, ఇటీవల ఈ సినిమాని చూసిన నిర్మాత దిల్ రాజు పెదవి విరిచినట్టు తెలుస్తోంది. చాలా సీన్స్ ని రీషూట్స్ చేయాలని సూచించాడట. ఈ మూవీలో వినాయక్ పక్కన హీరోయిన్ గా నటించిన శ్రియతో వినాయక్ కాంబినేషన్ కూడ బాగాలేదని అందువల్ల హీరోయిన్ ను కూడ మార్చే విషయమై దిల్ రాజ్ ఆలోచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa