అక్షయ్ కుమార్ 'గుడ్‌న్యూస్' మూవీ అంచనాలకు అనుగుణంగా కలెక్షన్లు రాబడుతోంది. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.17.56 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కలెక్షన్లు డబుల్ ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వినోదం ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. సమకాలిన సమస్యకు హాస్యం జోడించి చెప్పడంలో దర్శకుడు రాజ్ మెహతా సఫలమయ్యారు. ఈ సినిమా గురించి రివ్యూలు కూడా సానుకూలంగా రావడంతో మున్ముందు వసూళ్లు బాగానే ఉండే అవకాశముంది. గతవారం విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'దబాంగ్ 3' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలకావడం 'గుడ్‌న్యూస్'కు కలిసిరావొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa