ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఉత్తర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2019, 06:16 PM

తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో నిమ్మల శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి 3న విడుదలకు సిద్దం అయిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. కొన్ని కథలు కొన్నిజ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. వాటిలోని స్వచ్ఛదనం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది అలాంటి కథే ఉత్తర. తెలంగాణా సొగసును తెరమీద ఆవిష్కరించిన ఈ మూవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు జనవరి 3 రాబోతుంది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ తో పాటు రాజకీయ ప్రముఖలు పాల్గోన్నారు. ఈ సందర్బంగా కమెడియన్ వేణు మాట్లాడుతూ: ‘దర్శకుడు రాసుకున్న సీన్ప్ చదివిని తర్వాత ఆయనపై నమ్మకం పెరిగింది. అంత అందంగా కథ ని రాసారు. ఏదో ఒకరోజు షూటింగ్ అంతా కొత్త వాళ్లు అనుకుంటూ లోకేషన్ లోకి వెళ్ళిన నాకు ఈ టీం తో పనిచేయడం ట్రీట్ లాగా అనిపించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను ‘ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa