ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రికార్డు సృష్టింతున్న 'సామజవరగమన’ వీడియో ప్రోమో సాంగ్‌!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2019, 06:08 PM

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘సామజవరగమన’ సాంగ్ టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ అయి ఘన విజయం సాధించింది. కాగా తాజాగా ఈ సాంగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేసింది చిత్రబృందం. సోషల్‌ మీడియాను మరోసారి షేక్‌ చేస్తోంది 'సామజవరగమన' సాంగ్. న్యూఇయర్‌ కానుకగా ఈ సాంగ్‌ వీడియో టీజర్‌ను అల..వైకుంఠపురములో ' చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటికే 'సామజవరగమన' లిరికల్‌ సాంగ్‌ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ పాట వీడియో ప్రోమోను కూడా నెటిజన్లు అంతకు మించి ఆదరిస్తున్నారు. ఈ వీడియో సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే 1.5 మిలియన్‌కు పైగా రియల్‌ వ్యూస్‌.. లక్షకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకొవడంతో పాటు సినీ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ పాటలోని సాహిత్యాన్ని, భావాన్ని హీరో అల్లు అర్జున్‌ చేత దృశ్య రూపంలో పలికించారు కొరియోగ్రఫర్స్‌. ఈ చిత్రంలో అల్లు అర్జున్..పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa