ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ కి జోడి గా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 12:47 PM

వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్న కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా ఈమె నటించిన 'విక్రమ్ వేదా', 'సత్య' సినిమాలు మంచి విజయాలను అందించాయి. ప్రస్తుతం మరొక తమిళ సినిమాకి కూడా ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ధనుష్ హీరోగా, బాలాజీ మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న సినిమా ‘మారి 2’. 2015లో వచ్చిన ‘మారి’ (తెలుగులో ‘మాస్’) మూవీకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో వరలక్ష్మి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా...ఈ మూవీలో మలయాళం యాక్టర్ టోవినో థామస్ ప్రతినాయకుని పాత్రలో నటిస్తుండగా...మరొక నటుడు కృష్ణ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటించబోతున్న...ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలను అందిస్తున్నారు. వండర్ బేర్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ ఈ సినిమాని తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa