ఇతర ప్రాజెక్టులతో నటుడు నాగార్జున బిజీగా ఉండటం వల్ల .. దర్శకుడు కల్యాణ్ కృష్ణ వ్యక్తిగత కారణాల వల్ల బంగార్రాజు ప్రాజెక్టు ఆలస్యమైంది. ఇప్పడు ఈ ప్రాజెక్టు ముందుకు కదిలినట్టు సమాచారం. ఈ కథపై కసరత్తు పూర్తిచేసిన కల్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిటింగ్స్ లో పాల్గొంటున్నాడట. మార్చి 3వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా పనులు జరుగుతున్నాయట. నాగార్జున – రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో, నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa