బాలీవుడ్ చిత్రం స్ట్రీట్ డ్యాన్సర్-3డీ సినిమాలో నటి నోరా ఫతేహీ కెనడియన్ డ్యాన్సర్ పాత్రలో సందడి చేసింది. ఆ పాత్రలో నోరా ప్రత్యేకంగా కనిపించేందుకు ఆమె హెయిర్ స్టైల్ లో మార్పులు చేశారు. ఒత్తుగా, పొడవుగా ఉండే పోనీటెయిల్ కోసం రూ.2.5 లక్షలు ఖర్చు చేశారు. కేవలం నోరా కోసమే ఆ పోనీటెయిల్ తయారుచేశారట. కొంచెం బరువుగా ఉన్నా లుక్ కోసం భరించానని నోరా పేర్కొంది. స్ట్రీట్ డ్యాన్సర్-3డీ చిత్రంలో శ్రద్ధా కపూర్, నోరా ఫతేహీ ఒకరితో ఒకరు పోటీ పడి డ్యాన్స్ చేసే సన్నివేశం ఉంటుంది. అందులో నోరా లుక్ డిఫరెంట్ గా కనిపించేందుకే లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా హెయిర్ స్టైలింగ్ చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa