ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ గా ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 25, 2020, 02:46 PM

తేజ మార్ని దర్శకత్వం వహించిన చిత్రం ‘జోహార్‌’.  ధర్మ సూర్య పిక్చర్స్  పతాకంపై  భాను సందీప్ మార్ని నిర్మించారు. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంది. తాజాగా ‘లైఫ్‌ ఆఫ్‌ జోహార్‌’ పేరిట  ఈ  సినిమాకు సంబంధించిన  చిన్న వీడియోను చిత్ర బృందం  విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతున్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. నటులు నైనా గంగూలీ.. రోహిణి, శుభలేఖ సుధాకర్‌, తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ సంగీతమందించాడు.  ‘దృశ్యం’ ఫేమ్‌ ఎస్తర్‌ అనిల్‌, సీనియర్‌ నటి ఈశ్వరీరావు ప్రధాన తారాగణంగా ఈ మూవీ రూపొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa