ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ‘మాస్టర్’ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 07:45 PM

 ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నాడు. మాళవిక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఆండ్రియా, శాంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్..టైటిల్ పాత్రధారైన మాస్టర్ క్యారెక్టర్‌తో పాటు స్టూడెంట్ లీడర్‌గా ద్విపాత్రాభినయం చేయతున్నట్టు సమాచారం.ఇప్పటికే ఈ చిత్రానికి రెండు లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి విజయ్, విజయ్ సేతుపతి కొదమ సింహాల్లా పోట్లాడుకుంటున్న ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ పై ఈ సినిమాను ఏప్రిల్ 2020ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. కానీ కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను తమిళ సంవత్సరాది కానుకగా గుడ్ ఫ్రైడే అయిన ఏప్రిల్ 10న విడుదల చేయాలని ఆల్రెడీ ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. గత కొన్నేళ్లుగా విజయ్ తన ప్రతి చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఈ సారి మాత్రం ‘మాస్టర్’ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa