హీరోగా సునీల్ తొలినాళ్లలో విజయాలను అందుకుంటూ వచ్చినప్పటికీ, ఆ తరువాత పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో సునీల్ కమెడియన్ గానే కొనసాగాలనే ఉద్దేశంతో వెనక్కి వచ్చేశాడు. అయితే ఈలోగా వెన్నెలకిషోర్ ఆయనకి గట్టిపోటీగా నిలిచాడు. దాంతో సునీల్ తనకి సరైన పాత్ర పడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే 'అరవింద సమేత' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు సునీల్ కి బాగా హెల్ప్ అవుతాయని అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల్లోని పాత్రలు ప్రేక్షకులు ఎంతమాత్రం గుర్తుపెట్టుకోనివే. తాజాగా బోయపాటి తన సినిమాలో సునీల్ కి ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చినట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణతో బోయపాటి చేయనున్న ఈ సినిమాలో సునీల్ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉందనే అంటున్నారు. ఈ సినిమా అయినా ఆయనను కమెడియన్ మళ్లీ నిలబెడుతుందేమో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa