పిట్ట కథలు అంటే తక్కువ నిడివితో చెప్పేవి. వీటిలో పెద్ద పెద్ద విషయాలే ఉంటాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన పిట్టకథను తెరపై చూపించబోతోంది భవ్య క్రియేషన్స్ సంస్థ. సినిమా పేరు ‘ఓ పిట్ట కథ’. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశారు. చెందు ముద్దు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఓ పిట్ట కథ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ ”ఈ సినిమాతో నాకు ఒక లింకు ఉంది. అదేమంటే నాకు ఈ కథ తెలియడమే. కథ విన్నపుడు చాలా ఆసక్తి అనిపించింది. టైటిల్ గురించి చర్చ వచ్చినపుడు ఓ పిట్ట కథ టైటిల్ బాగా నచ్చింది. ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ అనే క్యాప్షన్ పెట్టమని సలహా ఇచ్చాను. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమా అనే నమ్మకంతో పోస్టర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాను” అని చెప్పారు. నిర్మాత వి.ఆనంద్‌ప్రసాద్ మాట్లాడుతూ ”కొత్తవారితో సినిమా తీయాలనే ఆలోచనతో ఉన్నపుడు చెందు ముద్దు చెప్పిన ఓ చిన్న కథ ఆసక్తి కలిగించింది. అందుకే వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లాం. ఆ కథే ఓ పిట్టకథ” అని అన్నారు. ”ఒకవైపు కామెడీ, మరోవైపు థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. మార్చిలో విడుదల చేస్తాం ” అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి చెప్పారు. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్ భోగిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: శ్రీజ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణ: సునీల్ కుమార్ యన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa