అందాలతార హన్సిక పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది చిలిపితనంతో కూడిన అమ్మాయని. అయితే అభిమానులతో లైవ్ చాట్ చేస్తూ హన్సిక ఈ సారి అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బన్నీ తన మొదటి సహనటుడని, అతను గొప్ప డాన్సర్ అని చెప్పింది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన దేశముదురు చిత్రంలో హన్సిక, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. లైవ్ చాట్ లో ఓ అభిమాని హన్సికను మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అన్నదానికి సమాధానంగా వివాహం చేసుకునే ఆలోచన లేదని చెప్పింది ఈ సొట్ట బుగ్గల సుందరి. ఒక అభిమాని తన మొబైల్ నంబర్ చెప్పమని నటిని అడిగినప్పుడు, ఆమె స్మార్ట్ రిప్లై ఇచ్చింది. కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పోషించిన తర్వాత హన్సిక తమిళ చిత్రాల్లో బిజీగా మారింది.
Actress Hansika Superb Words About Stylish Star Allu Arjun || Hansika Li... https://t.co/g39LPPhWff via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) January 28, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa