ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఓ పిట్ట కథ' మూవీ టీజర్ ఎప్పుడంటే ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 12:51 PM

 భవ్య క్రియేషన్స్‌ తాజాగా 'ఓ పిట్ట కథ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తో చందు ముద్దు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజరురావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు ఈ మూవీ లో నటిస్తుండగా..తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను త్రివిక్రమ్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు. కాగా ఈ మూవీ తాలూకా ప్రీ టీజర్ ను ఫిబ్రవరి 1 న రిలీజ్ చేయబోతున్నారట. ''కామెడీ, థ్రిల్లింగ్‌ అంశాలతో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. 'ఒక గ్రామంలో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశమూ స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బా నవ్విస్తూ. మరోవైపు ఏం జరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా తెరకెక్కించాం' అని దర్శకుడు చందు చెపుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa