డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'మేన్ వర్సెస్ వైల్డ్' ప్రోగ్రాం ఎంత ఫెమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పోయిన సారి ఈ ప్రోగ్రాంలో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆ ప్రాగ్రాం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సారి మేన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పులులు సంచరించే బందీపూర్ ఆటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. ఈ షూటింగ్ సమయంలో రజినీకాంత్ కు గాయాలు అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై సూపర్ స్టార్ స్పందించారు. కిందపడినప్పుడు చిన్న చిన్న ముల్లు గీరుకున్న కారణంగా శరీరంపై కొన్ని గీతలు ఏర్పడ్డాయే తప్ప ఎలాంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa