టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి - బాలకృష్ణ లు ఈ సారి దసరా బరిలో నిలవనున్నారు. చిరంజీవి - కొరటాల సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. హిట్ సినిమాల దర్శకుడు కొరటాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. మెసేజ్ తో కూడిన కామెడీ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించనున్నట్టు తెలుస్తోంది. దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేసే దిశగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నారు.
ఇక హిట్ కాంబినేషన్ బాలయ్య -బోయపాటి సినిమా కూడా దసరా బరిలో నిలవనుంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బాలకృష్ణ - బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దసరా బరిలో తమ సినిమా వుండవలసిందేనని బోయపాటితో బాలకృష్ణ గట్టిగానే చెప్పారని అంటున్నారు. ఇద్దరు బడా హీరోలు దసరా రేసులో ఉండడంతో దసరా పోరు ఈ సారి రసవత్తరంగా మారే అవకాశం కనపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa