ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జాను' ట్రైలర్ వచ్చేసింది!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2020, 05:04 PM

శర్వానంద్ .. సమంత జంటగా ప్రేమ్ కుమార్ రూపొందిస్తున్న 'జాను' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రీలీజ్ చేసారు. ట్రైలర్ ను  బట్టి చూస్తే ఈ సినిమా మంచి లవ్ స్టోరీ ల కనిపిస్తుంది. ఐటీ తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషిస్తుండగా, త్రిష పాత్రలో సమంత కనిపించనుంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన ఈ సినిమాపట్ల నిర్మాతగా 'దిల్' రాజు ఎంతో నమ్మకంతో వున్నాడు. ఇక శర్వానంద్ - సమంత ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. 






 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa