ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2020, 06:49 PM

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఒక సినిమా చేయడానికి దర్శకుడు క్రిష్ రంగంలోకి దిగాడు. మొఘల్ రాజుల కాలం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ ఒక 'దొంగ'గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ భారీ చారిత్రక చిత్రానికి ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిపెట్టుకున్న క్రిష్, చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసే ఆలోచనలో వున్నాడని అంటున్నారు.


ఇక ఆ తరువాత ప్రాజెక్టును కూడా క్రిష్ లైన్లో పెట్టేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కంచె' వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. అందువలన క్రిష్ వినిపించిన కథకి వెంటనే వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa