తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో రష్మిక కు హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో అంటున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ త్వరలోనే సెట్స్ వెళ్తుందని ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అనే న్యూస్ వినబడుతుంది. ఇప్పటికే రష్మిక తో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పూర్తికాగానే త్రివిక్రమ్ తో సినిమా మొదలెట్టబోతున్నాడని అంటున్నారు. మరి ఈ దెబ్బకి ఎన్టీఆర్ సరసన కూడా రష్మికనే హీరోయిన్ అయితే.. అమ్మడు రేంజ్ మారిపోయినట్లే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa