పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘పింక్’ రీమేక్ కు నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ ను పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశ్యంతో ఔట్ డోర్ షూటింగ్స్ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్ వేసి ఇండోర్ లోనే నిర్వహించాలని భావిస్తున్నాడట. అందుకే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు వీధి సెట్లు .. కోర్టు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa