ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛల్... "ఛలో" దుమ్మురేపుతున్న నాగశౌర్య

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2018, 02:39 PM

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో అన్ని వరుస సక్సెస్‌లు సాధించిన ఈ హీరో... ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఫుల్ అండ్ ఫుల్ రొమాంటిక్ డ్రామాలో కొనసాగే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. 





 ఇందులో నాగశౌర్య సరసన ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మ‌ధ్య టీజ‌ర్ విడుద‌ల చేసి చిత్రంపై భారీ అంచనాలే పెంచేశారు. భారీ నిర్మాణంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో నాగశౌర్య ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తుండ‌గా, ర‌ష్మిక కొంటె చూపుల‌తో అల‌రిస్తుంది. ఇందులోని కొన్ని ఫ్రేమ్స్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. 


మొత్తానికి ఈ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. న‌రేష్‌, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఆ పాటపై మీరూ ఓ లుక్కేయండి. కాగా, ఈ వీడియోను సుమారుగా ఏడు లక్షల మంది వరకు వీక్షించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa