దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ నటుడు అఖిల్ తో ఓ రొమాంటిక్ కామెడి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమయింది. అందుకే ఈ చిత్ర చిత్రీకరణను వేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. అఖిల్, పూజా కెమిస్ట్రీ ఈ ప్రేమ కథలో హైలెట్‌గా ఉంటుందట. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్‌తో సినిమా ప్రథమార్ధం పూర్తయిందట. ఈ నెల మొదటివారం నుంచి తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మార్చి చివరి వారంలోగా షూటింగ్ పూర్తి చేసి, ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa