దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న రెడ్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది అమ్రిత్ అయ్యర్. ఈమె అచ్చు అక్కినేని కోడలు సమంతను పోలి ఉండడం ఆసక్తికర చర్చకు తావిస్తోంది. కళ్లు.. ముక్కు.. కనుబొమలు.. హెయిర్ స్టైల్…పెదాలపై చిరునవ్వు ..ఎక్స్ ప్రెషన్.. ఆ ఫోజ్ చూస్తుంటే సమంతకి చెల్లిలా ఉందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత.. అయ్యర్ ఇద్దరినీ పక్కపక్కనే నిలబెడితే సిస్టర్స్ అని అంగీకరించాల్సిందే. తాజాగా ఈ ఫోటోని రెడ్ చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియలో జోరుగా వైరల్ అవుతోంది. సమంత కి చెల్లిలా ఉన్నావు అంటూ నెటిజనులు ఈ ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది సమంత బంధువా అని ఆరా తీస్తున్నారు. సమంత తాలూకానే.. అందుకే ఈ పోలికలు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు. రెడ్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa