ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూ​ట్యూబ్‌లో ట్రెండ్ అవుతోన్న ‘వాట్ ఏ బూటీ’ సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2020, 04:00 PM

నటులు  నితిన్‌, రష్మికలు  జంటగా నటిస్తోన్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలోని వాటే బ్యూటీ అనే వీడియో సాంగ్ ను నిన్న రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సాంగ్ లో   అదిరేటి  స్టెప్పులతో  మైమరిపించారు హీరోహీరోయిన్. ముఖ్యంగా రష్మిక ఈ వీడియోలో క్యూట్‌గా, ఫుల్‌ గ్లామర్‌తో కనిపిస్తుండటంతో యూత్‌కు ఈ సాంగ్‌ బాగా కనెక్ట్‌ అయింది. దీంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వాట్‌ ఏ బూటీ’  సాంగ్‌ వీడియో ప్రోమో రిలీజ్‌ అయిన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుని యూ​ట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.  మహతి స్వరసాగర్  కంపోజ్‌  చేసిన  ఈ  పాట హార్ట్‌ బీట్స్‌ పెంచేస్తుందని.. కొరియోగ్రఫీ గత్తర లేపుతుంది అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా నితిన్‌-రష్మికల జోడి సూపర్బ్‌గా ఉందని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉందని పాజిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa