చైతన్య, సమంత పెళ్లైన తర్వాత జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా తెలుగులో మంచి విజయాన్నే సాధించింది. తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్‌లోనే మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడిగా శివ నిర్వాణ కూడా ఈ సినిమాను డీల్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు వెళుతుంది. ఇక హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయకుండా.. డైరెక్ట్‌గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. హిందీలో కూడా ‘మజిలీ’ టైటిల్ అని కన్ఫామ్ చేసారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తికావొచ్చాయని సమాచారం. త్వరలోనే యూట్యూబ్‌లో కూడా ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా నటించిన జాను థియేటర్స్‌లోె విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకోవైపు నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. పూర్తి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కోతున్న ఈ చిత్రంపై చాలానే అంచనాలే ఉన్నాయి. మరోవైపు నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో తెరకెక్కబోతున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సీక్వెల్..‘బంగార్రాజు’లో నాగార్జున మనవడి పాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి నాగ చైతన్య , సమంత డైరెక్ట్‌గా హిందీలో ఎంట్రీ ఇవ్వకుండా.. ఇలా డబ్బింగ్ సినిమాతోనైనా జంటగా ఎంట్రీ ఇవ్వడం చూసి అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa