ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చనిపోయిన మెగా అభిమాని కుటుంబానికి రామ్‌చరణ్‌ 10లక్షల ఆర్థిక సాయం

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2020, 02:13 PM

నెల రోజుల క్రితం హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం అందరికి విదితమే.   ఆవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి గారు సికింద్రాబాద్‌లోని వారి ఇంటికి స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చారు. అప్పట్లో విదేశాలలో ఉన్న  రామ్‌చరణ్‌ గారు, నేను హైదరాబాద్ రాగానే నూర్ మహ్మద్ గారి  కుటుంబాన్ని కలుస్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ రోజు నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను రామ్ చరణ్  గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయలు  చెక్కు వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆ కుటుంబ సభ్యులు ఆనందానికి అవధుల్లేవు. మీకు ఎన్నటికీ ఋణపడి వుంటామని ఆ కుటుంబ సభ్యులు  ముక్తకంఠంతో శ్రీ రామ్‌చరణ్‌ గారికి చెప్పడం జరిగింది. నూర్ మహ్మద్ గారు మా కుటుంబం పేరున చేసిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా ఆయన చేసే కార్యక్రమాలు మేము చూడాలని, మాకు తెలియాలని ఎప్పుడు కోరుకోకుండా మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు అనేక సేవా కార్యక్రమాలు చేసారని,  అటువంటి గొప్ప అభిమానిని నేను ఎప్పుడు చూడలేదని ఈరోజు ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. దాదాపు 45 నిముషాలు  నూర్ మహ్మద్ గారి కుటుంబంతో ఈరోజు గడిపారు. ఆయన చేసిన సేవలను  రామ్ చరణ్ విశేషంగా కొనియాడారు. నూర్ మహ్మద్ గారిని తిరిగి తీసుకొని రాలేనని, కానీ మీ ఇంటిలో పెద్ద కొడుకులా మీకు అండగా ఉంటానని, అదే విధంగా నూర్ మహ్మద్ గారి కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని  అంతే కాకుండా అమ్మాయిల పెళ్లిళ్లుకు నేను స్వయంగా వస్తానని ఆ కుటుంబానికి  రామ్ చరణ్ భరోసా ఇవ్వడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa