విజయ్ సినిమా వస్తుంది అంటే.. ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ ఆ క్రేజే వేరు. కానీ వరల్డ్ ఫెమస్ లవర్ విషయంలో అది ఇక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు కానీ.. మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు. ఎందుకంటే వరల్డ్ ఫెమస్ లవర్ టీజర్ కానీ, ట్రైలర్ కానీ.. అంతగా జనాలకి ఎక్కినట్టుగా అనిపించలేదు. అసలు విజయ్ ట్రైలర్ అంటే యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉండాలి. కానీ వరల్డ్ ఫెమస్ లవర్ ట్రైలర్ కి అంత సీన్ కనబడలేదు. ఎందుకో ఎక్కడో సినిమాకి తేడా కొడుతోంది. మరి ఇలాంటి టాక్ తో సినిమాకి బెస్ట్ ఓపెనింగ్ పడడం అనేది కాస్త డౌట్. అసలు ప్రేక్షకులు వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా విషయంలో ఓ అంచనాకి రాలేకపోతున్నారు. చాలా వీక్ గా ఉంది ఈ సినిమాపై క్రేజ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa