ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లవర్స్ డే పైనే యంగ్ హీరోల చూపు...

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 02:34 PM

ఫిబ్రవరి 14 వస్తుందంటే ప్రేమికులంతా వారివారి ప్రియులకు ఏ గిఫ్ట్ ఇద్దామనే ఆలోచనలో ఉంటారు. అలాగే యంగ్ హీరోలు సైతం సినీ ప్రియుల కోసం తమ సినిమాల అప్ డేట్ ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య మూవీ అప్ డేట్ చూద్దాం. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ‘లవ్ స్టోరీ’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏయ్ పిల్లా’ అనే ఫస్ట్ సాంగ్ ను ఫిబ్రవరి 14 ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ స్కూల్‌కి చెందిన పవన్‌ సి.హెచ్‌ ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు.
తమిళ యంగ్ హీరో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేలా ప్లాన్ చేశాడు. ‘ఖైదీ’ ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.
వీరిలా ఉంటే నేను ఒకరోజు ముందే వస్తానంటున్నాడు సాయిధరమ్ తేజ్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్న సాయి తేజ్ వాలెంటైన్స్ డే నాడు సింగిల్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. థీమ్ వీడియో ఫిబ్రవరి 13 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
యంగ్ హీరో సందీప్ కిషన్ అయితే రెండు రోజు ముందే లవర్స్ డే కానుక ఇస్తానంటున్నాడు. లావణ్య త్రిపాఠి కలిసి ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ఎక్కిన సందీప్ ఈరోజే తన పాటతో అలరించాడు. హిప్ హాప్ సంగీత సారధ్యంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన ‘సింగిల్ కింగులం’ అనే పాటను విడుదల చేశారు. డెన్నిస్ జీవన్ కనుకొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హాకీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa