ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త మూవీ ప్రారంభించిన కార్తికేయ !

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 02:13 PM

కార్తికేయ హీరోగా నేడు ఓ కొత్త మూవీ ప్రారంభించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ 2 పతాకంలో ఈ చిత్రం రూపొందుతుంది. ‘చావు కబురు చల్లగా’ అనే ఓ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ హీరో కార్తికేయ బస్తీ బాలరాజు గా లుంగీలో ఇరగదీస్తున్నాడు. నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా మూవీ ప్రారంభమైంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఈ చిత్రంలోని మిగతా నటులు మరియు పూర్తి సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. ఇక గత ఏడాది కార్తికేయ మూడు సినిమాలు విడుదల చేశారు. వాటిలో గుణ 369 అతనికి ఓ మోస్తరు విజయాన్ని అందించింది. ఆర్ ఎక్స్ 100 తరువాత ఆ స్థాయి విజయాన్ని కార్తికేయ అందుకోలేదు. మరి చావు కబురు చల్లగా సినిమాతో అయినా ఆయన మంచి హిట్ అందుకుంటారేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa