ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కలెక్షన్స్ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2020, 12:20 PM

దర్శకుడు క్రాంతి దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ హీరోగా  మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా నిన్న విడుదలై మిశ్రమ స్పందనను సాధించింది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. నైజాం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. రూ. 2.02 కోట్లు ను రాబట్టింది ఈ చిత్రం. విజయ్ కి నైజాంలో అభిమానుల ఫాలోయింగ్ ఎక్కుక ఉంది. అందుకే కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. కాగా వచ్చే వారం కూడా ఈ సినిమా రన్ స్టడీగానే కొనసాగితే పంపిణీదారులు లాభాల్ని ఆర్జించే అవకాశం ఉంది. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్, యాటిట్యూడ్‌ అండ్ విజయ్ – రాశిల మధ్య కెమిస్ట్రీ అలాగే కొన్ని లవ్ ఎపిసోడ్లు బాగున్నాయి అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa