అల్లు అర్జున్ తన తరువాత సినిమాని యేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. వెకేషన్ లో ఉన్న బన్నీ మార్చి నుండి ఈ సినిమా షూట్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరుగుతుండటం కారణంగా సినిమాలో చాల క్యారెక్టర్స్ ఉంటాయని.. ఆ క్యారెక్టర్స్ లో కొత్తవారు అయితేనే బాగుంటుందని సుకుమార్ ఫీల్ అవుతున్నాడట. ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా రివెంజ్ ఫార్ములాతోనే తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa